Monday 10 August 2015

స‌ర్వేలు ! kompa munchinayee

భ‌స్మాసుర స‌ర్వేలు!


ఏదైనా విష‌యాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డంలో చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా... ఓటుకునోటు కేసు ప‌క్కకు నెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌, సెక్ష‌న్‌8 గోల ఇక‌ రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్‌ దుర్ఘ‌ట‌న‌లో త‌మ నిర్ల‌క్ష్యం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు సీడ్ క్యాపిట‌ల్ ప్లాన్‌, రాజ‌మండ్రి పేరు మార్పులు వంటి టెక్నిక్‌లు చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్యం. అదే లెవ‌ల్లో ఇప్పుడు ప్ర‌త్యేక హోదా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి అంశాల నుంచి ప్ర‌జ‌ల‌దృష్టినుంచి మ‌ళ్లించేందుకు మంత్రులు, ఎమ్మెల్యే ప‌నితీరుపై స‌ర్వే అంటూ కొత్త గేమ్ బాగానే ఆడారు చంద్ర‌బాబు.

కాక‌పోతే... మిగ‌తా రాంగ్‌రూట్ గేమ్‌ల్లా కాకుండా ఈ కొత్త నాట‌కం మాత్రం రివ‌ర్స్ కొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది చంద్ర‌బాబుకు. మంత్రుల ప‌నితీరుపై చేసిన స‌ర్వే ప‌రీక్ష‌లో చాలామంది మంత్రులే ఫెయిల‌య్యారు. ఏదో విష‌యాన్ని మ‌రిపించేందుకు చేసిన ఈ స‌ర్వే ప్లాన్ ఇప్పుడు అస‌లుకే ఎస‌రు పెడుతోంది. ఫెయిల‌యిన మంత్రుల‌ను ఏం చేయ‌బోతున్నార‌ని వ‌స్తున్న ప్ర‌శ్న‌లు చంద్ర‌బాబుపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఆ మంత్రుల‌ను తొల‌గిస్తారా..? లేక రాజీనామా చేయిస్తారా..? మ‌ంత్రులుగా ప‌నికిరాని ప్ర‌జాప్ర‌తినిధులు ఎమ్మెల్యేలుగా అయినా ప్ర‌జ‌ల‌కు ఏం సేవ చేస్తారు. మ‌రి వారితో ఎమ్మెల్యేలుగా కూడా రాజీనామా చేయించి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఏమైనా వెళ‌తారా?

ఆ మాట‌కొస్తే... చంద్ర‌బాబుకు కూడా ఫ‌స్ట్ ర్యాంకు రాలేదు. అంటే త‌న వైఫ‌ల్యాన్ని త‌నే బయ‌ట‌పెట్టుకున్న‌ట్లు కాదా! మ‌రి త‌న‌కు తాను కూడా శిక్ష వేసుకుంటారా..? ముఖ్య‌మంత్రిగా రాజీనామా చేసి మ‌రొక‌రికి ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తారా..? లేక త‌న ప‌నితీరు బాగాలేకున్నా ఇంకా సిఎంగా కొన‌సాగుతారా..? ఫ‌స్ట్ ర్యాంకు రాని తాను ముఖ్య‌మంత్రిగానే కొన‌సాగుతానంటే... ప‌నితీరు బాగాలేద‌ని మిగ‌తా మంత్రుల‌పై చ‌ర్య తీసుకునే నైతిక హ‌క్కు చంద్ర‌బాబుకైనా ఎలా సంక్ర‌మిస్తుంది..? ఇదిగో ఇవే ప్ర‌శ్న‌లు తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో మెదులుతున్నాయి. వీటికి చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెపుతారు. ఆన్సర్ చేస్తారా... లేక ఈ ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు మ‌రోప్లాన్ వేస్తారా... వేచి చూద్దాం

No comments:

Post a Comment