Sunday 9 August 2015

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్, భేటి బచావో భేటి పడావో, జన ధన్ యోజన వంటి పథకాలను ఇకపై బిచ్చగాళ్ళు ప్రచారం చేయబోతున్నారు

వాడకం అంటే ఇది: బిచ్చగాళ్లకు శిక్షణ ఇప్పించనున్న కేంద్రం!
 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్, భేటి బచావో భేటి పడావో, జన ధన్ యోజన వంటి పథకాలను ఇకపై బిచ్చగాళ్ళు ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే రేడియోలు టెలివిజన్, వార్త పత్రికలలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజలకు మరింత చేరువ కావడానికి రైళ్ళలో యాచకులకు శిక్షణ ఇప్పించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించబోతున్నారు. 

ఇన్నాళ్ళు బిచ్చగాళ్ళు వివిద రకాల పాటలు పాడుకుంటూ రైళ్ళలో ప్రయాణికుల వద్ద నుండి డబ్బులు అడుకుంటున్నారు. వారికీ తోచిన పాటలు పాడి ఆడుకోవడం కంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపై ప్రజలలో అవగాహనా కల్పించే వారికీ ఉపాది కల్పించడానికి సర్వం సిద్దం చేసుకుంది. ప్రజలలో నిత్యం తిరిగే యాచకులు పాటల ద్వారా ఈ పథకాలు ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోతాయని ప్రభుత్వం భావిస్తోంది

ఇన్నాళ్ళు బిచ్చగాళ్ళు వివిద రకాల పాటలు పాడుకుంటూ రైళ్ళలో ప్రయాణికుల వద్ద నుండి డబ్బులు అడుకుంటున్నారు. వారికీ తోచిన పాటలు పాడి ఆడుకోవడం కంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపై ప్రజలలో అవగాహనా కల్పించే వారికీ ఉపాది కల్పించడానికి సర్వం సిద్దం చేసుకుంది. ప్రజలలో నిత్యం తిరిగే యాచకులు పాటల ద్వారా ఈ పథకాలు ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఇందుకు గాను కేంద్ర సమాచర, ప్రసారాల శాఖ అధ్వర్యంలో బిచ్చగాళ్ళకు శిక్షణ ఇప్పించి ప్రభుత్వ పథకాల విషయంలో పాటలను రూపొందిస్తోంది. ఇప్పటికే 5 వేల మంది బిచ్చగాళ్ళను ప్రభుత్వం గుర్తించి వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు శిక్షణ పూర్తి చేసుకుని త్వరలోనే రైళ్ళలో వారి గొంతును సవరించుకోనున్నారు. దీని ద్వారా బిచ్చగాళ్ళకు ప్రభుత్వం ఉపాది కల్పించినట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మంచి ప్రచారం కూడా జరుగుతుంది అనేది పెద్దల అభిప్రాయంగా ఉంది

No comments:

Post a Comment