Tuesday 11 August 2015

పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట

పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట

వాళ్ళిద్దరూ భార్యా భర్తలు...ప్రజల ఆరోగ్యాలని కాపాడాల్సిన డాక్టర్లు. కానీ పసివాళ్ళతో వ్యాపారం చేశారు... డ్రాకులాల వలె వాళ్ళ రక్తాన్ని పిండి కోట్లు సంపాదించారు... ఆ పసిపిల్లల ఆరోగ్యాలను ప్రమాదంలో పడేశారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో డాక్టర్ వీకే కోహ్లీ, డాక్టర్ చిత్రా కోహ్లీ లు కాంచన్ మార్కెట్ వద్ద ఓ పాథలాజికల్ ల్యాబ్ ఓపెన్ చేసి దందా ప్రారంభించారు. ఎనిమిదేళ్ళు కూడా నిండని పిల్లలను ప్రలోభపెట్టి వాళ్ళకు అణా,పరక ఇచ్చి వాళ్ళ దగ్గర రక్తాన్ని తీసుకుని ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. కొందరు పిల్లల దగ్గర్నుండి వరసగా మూడునాలుగు రోజులు కూడా రక్తాన్ని పీల్చేవారు. బ్లడ్ గ్రూప్ తెలుసుకునే టెస్టులు తప్ప మరే ఇతర టెస్టులు కూడా నిర్వహించకుండానే రక్తాన్ని తీసి అమ్మే వాళ్ళు ఇలా ఆరు సంవత్సరాలపాటు పదివేల మంది పిల్ల రక్తాన్ని పీల్చిన ఈ డ్రాకులా డాక్టర్లు నాలుగుకోట్ల రూపాయలు సంపాదించారు.
ఈ వ్యాపారం కోసం వీళ్ళిద్దరూ కొంతమంది బ్రోకర్లను కూడా నియమించుకున్నారు. స్లమ్ ఏరియాలోని నిరుపేద పిల్లలను టార్గెట్ చేసుకొని ఈ బ్రోకర్లు పనిచేసేవాళ్ళు. పిల్లల తల్లితండ్రులకు ఈ వ్యవహారం తెలిసి పిర్యాదు చేయడంతో కదిలిన అధికారగణం కోహ్లీల పాథలాజికల్ ల్యాబ్ పై దాడి చేశారు. సిటీ మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ మిశ్రా, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ ఏరియా సర్కిల్ ఇనిస్పెక్టర్ సర్వేష్ కుమార్ మిశ్రా ఇటీవల దాడులు నిర్వహించగా డాక్టర్ల జంట రక్తపు దందా వెలుగు చూసింది. అయితే ఆ డ్రాకులా డాక్టర్ల జంటను అరెస్టు చేద్దామంటే వాళ్ళిక్కడ లేరట ! అమెరికాలో ఉన్నారట. వాళ్ళొచ్చిందాకా ఎదురుచూస్తామని చెప్పిన పోలీసులు ఆ లోపు ల్యాబ్ మేనేజర్ వీకే భట్నాగర్, ల్యాబ్ టెక్నీషియన్ శాంతారాం యాదవ్ లను అరెస్టు చేసి, ల్యాబ్ ను సీజ్ చేశారు

 

No comments:

Post a Comment