Tuesday 11 August 2015

నాపై జోకులేశారు కాని వెనకడుగేయలేదు......

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్ గారు తన గత అనుభవం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు.గ్రామజ్యోతి పధకం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలగురించి ఆయన స్పందించాడు.గ్రామజ్యోతి పధకాన్ని విజయవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నాడు .
 
2001లో తాను తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు తన పైన జోకులు వేశారని, ఎందరో తిట్టారన్నారు. ప్రపంచంలో తనను తిట్టినట్లు ఎవరినీ తిట్టలేదన్నారు. కానీ, తెలంగాణ ఉద్యమానికి భారత రాజకీయ వ్యవస్థ దిగివచ్చి రాష్ట్రం ఇచ్చిందన్నారు. గ్రామజ్యోతి అద్భుతమైన కార్యక్రమం అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే చేస్తే తెలంగాణ అద్భుతంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న 750 మందికి ఒక చెత్త రిక్షా పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి ఒక డంప్‌యార్డ్, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామన్నారు.
 
డంప్ యార్డుల కోసం రూ.20 కోట్ల నుంచి రూ.20 నిధులతో ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామని, రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 25,000 రిక్షాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించాలన్నారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పాల్గొనాలన్నారు. గ్రామసభలో గ్రామస్తులే గ్రామ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. మనకు శక్తివంతమైన మహిళా సంఘాలున్నాయని, అందరి సమిష్టి కృషితో తెలంగాణను అద్భుతంగా తయారు చేయవచ్చన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా చెత్తా చేదారమే కనిపిస్తోందన్నారు.
 
అలా ఉండకూడదన్నారు. గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ గ్రామాలు వెలిగిపోవాలన్నారు. సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికై ప్లానింగ్ జరగాలన్నారు. ప్లానింగ్‌లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.

No comments:

Post a Comment