Sunday 2 August 2015

FB chatting lo atma -Arrest chesina police



మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది.. అమెకు ఫేస్ బుక్ లో స్పందన, సాత్విక అనే ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి నుంచి వీరి ముగ్గురి మధ్య ఫ్రెండ్‌షిఫ్ ఎక్కువైపోయింది. వీళ్ళు ముగ్గురూ ప్రతి రోజూ చాటింగ్ చేసే వారు. ఇలా 6 నెలల పాటు సాగిన అనంతరం అనుకోని విధంగా స్పందన, సాత్వికలు మృతిచెందారన్న సమాచారం ఆ విద్యార్థినికి అందింది. అయితే చాటింగ్‌లో మాత్రం తాము స్పందన, సాత్వికల ఆత్మలమని ఆ విద్యార్థినిని భయానికి గురి చేస్తూ వస్తున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆ విద్యార్థిని ఫేస్‌బుక్ లో ఆత్మలు వేదిస్తున్న విషయం తన స్నేహితుడైన నవీన్‌కు చెప్పింది. ఈ నవీన్ చిన్నప్పటినుండి ఈమెకు మితృడు, ఈమె కుటుంభానికికూడా బాగా పరిచయస్తుడు. తన తోటి స్నేహితురాలు పడుతున్న బాధను గుర్తించిన నవీన్ నేనున్నానంటూ ఆమెను ఓదార్చాడు. ఏం కాదులే భయపడకు ఆత్మలకు బంగారంతో పూజలు చేస్తే అవేమి నిన్ను ఏం చేయవ్ వదిలేస్తాయని చెప్పాడు. అతడి మాటలు పూర్తిగా విశ్వసించిన ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న బంగారాన్ని అపుడింత, ఇపుడింత ఇలా చివరికి 18 తులాల బంగారం నవీన్ చేతిలో పెట్టింది. ఈ తతంగమంతా రెండు నెలలుగా గడిచింది. ఇంట్లో ఉన్న బంగారం లేకపోవడాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా పిచ్చిపిచ్చిగా వ్యవహరించింది. ఆత్మలు తనను ఫేస్‌బుక్‌లో భయపెడు తున్నాయని.. వాటి శాంతి కొరకు బంగారంతో పూజలు చేస్తే నన్నేమి చేయవంటా అని తన స్నేహితుడు చెప్పాడంటూ మాటల్లో తన నవీన్ పేరును బయటపెట్టింది. వెంటనే తేరుకున్న ఆమె తల్లిదండ్రులు గద్వాల పోలీసులను సంప్రదించగా...పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.. అప్పుడు తెలిసిన విషయాలు పోలీసులను కూడా షాక్ కు గురి చేశాయి. అసలు స్పందన, సాత్విక అనే పేరు గల అమ్మాయిలెవరూ లేరని ఆ పేర్లతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అమ్మాయితో రోజూ చాట్ చేసేది నవీనే అని తేలింది. అమ్మాయిల పేరిట ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేశానని, వాళ్ళిద్దరు చనిపోయినట్టు మెసెజ్ పంపింది కూడా తానేనని నవీన్ అంగీకరించాడు. చివరకు పోలీసులు ఆత్మ ఉరఫ్ నవీన్ ను అరెస్టు చేయడంతో ఆ బీటెక్ అమ్మాయి ఊపిరి పీల్చుకుంది.

No comments:

Post a Comment