Friday 7 August 2015

వెంకయ్య వంకర మాటలు

తెలంగాణ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి “తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ అధికారం మూలంగా వచ్చిన అహంకారంతో మాట్లాడిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే లెవల్లో కేంద్ర మంత్రి, ఆంధ్రాకు చెందిన నేత వెంకయ్యనాయుడు కూడా మాట్లాడారు. తెలంగాణకు హైకోర్టు కావాలని తెలంగాణ ఎంపీలు చేస్తున్న ఆంధోళన నేపథ్యంలో హైకోర్టు పరిధిలో ఈ అంశం ఉందని … ఆ తరువాత తెలంగాణ హైకోర్టు గురించి ఆలోచిస్తామని కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ లోక్ సభలో ప్రకటన చేశారు.
 కేంద్రమంత్రి ప్రకటనలో కొత్త విషయం ఏమీలేదని, కోర్టు పేరుతో కేంద్రం తప్పించుకుంటుందని తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లేచారు. “తెలంగాణ హైకోర్టుకు సంబంధించి న్యాయశాఖా మంత్రి చేసిన ప్రకటనను కూడా ఉపసంహరించుకునేలా చేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఊగిపోయాడు. టీఆర్ఎస్ ఎంపీలు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారని కథలు చెప్పారు”. దీంతో తెలంగాణ ఎంపీలు సభ నుండి వాకౌట్ చేశారు.
హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నది స్వయంగా వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడేనని ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ తదితరులు సభ దృష్టికి తెచ్చారు. వ్యక్తుల ప్రస్తావన తేవద్దని స్పీకర్ వారించినా ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులకు వీరిద్దరే కారణమని ఎంపీలు స్పష్టంచేశారు.

No comments:

Post a Comment