Monday 10 August 2015

రిషితేశ్వ‌రి మరణంపై కమిటీ నివేధిక!

గ‌త వారంరోజుల క్రితం గుంటూరులోని నాగార్జున యూనివ‌ర్శిటీ లో ఆత్మ‌హ‌త్య చేసుకుని మృతి చెందిన తెలంగాణ వ‌రంగల్ జిల్లాకు చెందిన ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వ‌రి దేశంలో పెను సంచ‌ల‌నం రేక్కెత్తించింది. దీనిపై సీరియ‌స్ గా తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి విదిత‌మే. అయితే ఈ ఘ‌ట‌న పై విచార‌ణ చేప‌ట్టిన సుబ్ర‌మ‌ణ్యం క‌మిటీ ర్యాంగింగ్ వ‌ల్లే ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తేల్చింది. అంతేకాకుండా విచార‌ణ కు సంబంధించిన వివ‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది
ఈ నేప‌థ్యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఘ‌ట‌న సంబంధించిన వివారాల‌ను వెల్ల‌డించారు. యూనివ‌ర్శిటీలో ఉన్న భ‌యంకర పరిస్థితుల‌ను క‌మిటీ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. నైతిక‌త‌, మాన‌వీయ‌త లేని ఘ‌ట‌న‌ల వ‌ల్ల రిషితేశ్వ‌రి కుమిలి పోయింద‌ని, మాన‌సికంగా కుంగి పోయి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని మంత్రి గంటా తెలిపారు. భ‌విష్య‌త్లు లో ర్యాగింగ్ అనే ప‌దం ఉచ్ఛ‌రించ‌డానికి భ‌య‌పడేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 
 
యూనివ‌ర్శిటీ ఇన్ చార్జ్ వీసీ సాంబ‌శివ‌రావు ని తొల‌గించామ‌ని, ఆయ‌న స్థానం లో సాంకేతిక విద్యాశాఖ క‌మీష‌న‌ర్ ఉద‌య‌ల‌క్ష్మి ని నియ‌మించామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆర్విటెక్చ‌ర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబురావును డిస్మిస్ చేశామ‌ని, ఆరోప‌ణ‌లు రుజ‌వైతే ప్రాసిక్యూట్ చేస్తామ‌న్నారు. క‌మిటీ సిఫార్సు మేర‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ను నియ‌మించి ఈ కేసుని అప్ప‌గిస్తామ‌ని చెప్పారు. ఈ కేసులో 170 మంది విద్యార్థుల‌ను, యూనివ‌ర్సిటీ పెద్ద‌ల‌ను క‌మిటీ విచారించిద‌ని మంత్రి గంటా తెలిపారు. పోలీసుల పూర్తిస్థాయి విచార‌న‌కు ఆదేశించామ‌ని, నిందితులు ఇంకెక్క‌డా చదువుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 
 
మూడు యాక్టుల కింద రిషితేశ్వ‌రి కేసును విచారిస్తున్నామ‌ని మంత్రి గంటా తెలిపారు. ర్యాగింగ్ లో మ‌రికొంద‌రి పేర్లు కూడా ఉన్న‌ట్టు క‌మిటీ పేర్కొన్న‌ద‌ని తెలిపారు. యూనివ‌ర్సిటీ లో అనేక వ్య‌వ‌స్థ‌ల్లో లోపాలు ఉన్న‌ట్టు క‌మిటి గ‌ర్తించింద‌ని మంత్రి గంటా వెల్ల‌డించారు.  హాస్ట‌ళ్ల‌లో ర‌క్ష‌ణ లేదు. పూర్తిస్థాయి వార్డెన్లు లేరు. మూనివ‌ర్సిటీలో వ్య‌వ‌స్థాగ‌త లోపాలు అనేకం ఉన్నాయని క‌మిటీ గుర్తించింద‌ని చెప్పారు. ఆర్కిటెక్చ‌ర్ ప‌రీక్ష‌ల్లో ప్రిన్సిపాల్ చేతిలో కొన్ని మార్కులు ఉంటాయి. ఎవ‌రైనా ఫిర్యాదు చేసినా భ‌విష్య‌త్ ఏమ‌వుతుందోన‌న్న భ‌యం విద్యార్థుల్లో ఉంద‌ని క‌మిటీ పేర్కొంది.

No comments:

Post a Comment