Thursday 13 August 2015

స్వాతంత్ర్య వేడుకల్లో ఖైదీల కవాతు..

స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండ కోట ముస్తాబు అవుతోంది. అధికారుల పర్యవేక్షణలో సర్వాంగ సుందరంగా గోల్కొండ ప్రాంతాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. అయితే ఈ సారి వేడుకల్లో ఖైదీలు కూడా కవాతు చేయబోతున్నారు. అదేంటి ఖైదీలు కవాతు చెయడమెంటని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏంటంటే ఈ సారి జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో జైళ్ల శాఖ కూడా పాల్గోనబోతోంది. జైళ్ల శాఖ తరపున ప్రస్తుతం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చేత కవాతు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
 
ఖైదీలతో కవాతు నిర్వహించడం ఇదే మొదటి సారి. అధికారుల పర్యవేక్షనలో ఈ కవాతును నిర్వహించాలని జైళ్ల శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటికి ఏర్పాట్లు కూడ చేసుకుంటున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలోనే జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చకచక చేసేస్తోంది. ఉన్నతాధికారులు సిఎస్ రాజీవ్ శర్మ, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆగస్టు 15 న ఉదయం 10 గంటలకు కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే వేడుకల్లో తెలంగాణ కళారూపాలను ప్రదర్శించాలని అనుకున్న స్థలాభావం వల్ల సాధారణంగా జరపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment