Sunday 9 August 2015

చంద్రబాబు ఎప్పటికి నిజం చెప్తారు?


బీజేపీ తప్ప ప్రతీ పార్టీ ఆంద్ర ప్రాంతం లో ప్రత్యేక హోదా పైన తమదైన శైలి లో మాట్లాడేస్తున్నారు, ప్రత్యెక హోదా రాక తప్పదు అని ముఖ్యమంత్రి, టీడీపీ లీడర్ చంద్రబాబు కొన్ని నెలల నుంచీ పాడిందే పాడుతున్నా కూడా సుజనా చౌదరి స్వయంగా ప్రత్యేక హోదా విషయంలో కుండ బద్దలు కొట్టేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పడం తో చంద్రబాబు గాలిపోయింది. "ప్రత్యేక హోదా" స్థానే "ప్రత్యేక ప్యాకేజీ" ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు దీని గురించి ఎన్ని హంగామాలు చెయ్యాలో అని తెలుగు తమ్ముళ్ళు జుట్టుపట్టుకుంటున్నారు


 మరొక పక్క ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో కోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై చంద్రబాబు మాట్లాడుతూ.. మళ్ళీ అదే మాట రిపీట్ చేసారు! ఆలస్యమైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాక తప్పదని ఆయన మళ్ళీ చెప్పడం తో నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఆంద్ర ప్రాంతం జనాలది. యువత బలిదానాల వరకూ వెళ్ళింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ ఆలోచించాల్సిన ప్రభుత్వమే.. ఇంకా ఇంకా అబద్ధాలు చెబుతూ ఎదో ఒకటి సర్ది చెప్పేసి పబ్బం గడుపుకోవడం రాబోతున్న భవిష్యత్తు జనాల మీద పడుతుంది అని అర్ధం చేసుకోకపోతే ఎలా?
ఆత్మహత్యలకు పాల్పడితే ప్రత్యేక హోదా రాదని దీన్ని యువత గుర్తించాలని చంద్రబాబు సూచించారు. నిజమే ఏమి చేసిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం వీసవేత్తు కూడా లేదు! అదే మాట బహిరంగంగా చెప్పేసి ప్రత్యేక నిధుల కోసం అన్నా గట్టిగా ప్రయత్నంమొదలు పెట్టి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఎంతో కొంత ద్రవ్య లోటు నుంచి బయట పడేది కదా

No comments:

Post a Comment