Monday 10 August 2015

ఓటుకు నోటు స్కాం -- సెబాస్టియన్ ఫోన్‌లో 50 సంభాషణలు!

ఓటుకు నోటు స్కాం -- సెబాస్టియన్ ఫోన్‌లో 50 సంభాషణలు!

ఓటుకు నోటు కుంభకోణం కేసులో నిందితుడు బిషప్ హారీ సెబాస్టియన్ నుంచి స్వాధీనం చేసుకున్న హెచ్‌టిసి ఫోన్‌లో సంభాషణల రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఏపి ఫోరెన్సిక్ లేబరేటరీకి తెలంగాణ ఏసిబి పోలీసులు పంపారు. హెచ్‌టిసి ఫోన్‌లో కీలకమైన సంభాషణలు ఉన్నాయని, మే 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య దాదాపు 50 సంభాషణలు నమోదై ఉన్నాయని ఏసిబి వర్గాలు తెలిపాయి. ఇంద...ులో సెబాస్టియన్, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మధ్య దాదాపు 23 సంభాషణల ఉన్నాయని సమాచారం.
ఈ ఫోన్ సంభాషణలు విశే్లషిస్తే ఒక ప్రధాన వ్యక్తి ఆదేశాల మేరకు వీరు నడుచుకున్నట్లు విదితమవుతోందని ఏసిబి వర్గాలు తెలిపాయి.అరెస్టయిన వారితో పాటు మిగిలిన వ్యక్తుల సంభాషణలు ఈఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆడియో విజువల్స్, ఆడియో రికార్డింగ్‌లు సరైనవేనని, కూర్చినవి కావని ఫోరెన్సిక్ లేబరేటరీ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. కోర్టు ద్వారా తెలంగాణ అసెంబ్లీ నుంచి నిందితుడు, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాయిస్ రికార్డులు కావాలని ఏసిబి కోరింది.
ఈ వాయిస్ రికార్డులు వచ్చిన వెంటనే హెచ్‌టిసి ఫోన్‌లో రికార్డయిన, ఇతర ఆడియోల్లో రికార్డయిన సంభాషణలతో పోల్చిచూస్తారు. రికార్డయిన సంభాషణలు, నిందితులు, నిందితులుగా అనుమానిస్తున్న వారి గొంతుతో సరిపోతే కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం ఏసిబి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. ఈ కేసులో ఏసిబి ఒక చార్జిషీటును దాఖలు చేసింది. ఫోరెన్సిక్ వాయిస్ రికార్డింగ్ నివేదిక వచ్చిన వెంటనే మరో చార్జిషీటును దాఖలు చేయనున్నారు. ఇందులో మరికొంత మంది అనుమానితుల పేర్లను చేర్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment