Friday 28 August 2015

కంట తడి పెట్టిస్తున్న ఉల్లి.

కంట తడి పెట్టిస్తున్న ఉల్లి.
అందరు ఎకువగా మకువగా తినే ఉల్లి ఇల్లా రెటు పెరిగి బంగారం లాగ అయింది

పేరుగుతున ఉల్లి దరలు అందరిని కంటనీరు పెటిస్తునాయీ .దీనికి కారణం ఎవరు ?
సామాన్య మనుషులు ఇపుడు ఉల్లి ని కుడా సుశి ముర్సిపోవల్సిందే. సామాన్యుడికి అదికూడ దొరకనంత దూరంగా ఉంది .ఒకపుడు పేదవాడు కూరలు కొనుకొని పరిస్తితిలో ఈ ఉల్లి తో జోన్నరోటి తినేవాడు
అట్లాంటిది ఇపుడు అతనికి అదికూడా దొరికేలా లేదు .ఇక సామాన్యుడు ఏమికావాలి .ఇల్లా మండి పోయే దరలో ?

మన సోషల్ మీడియా లో ఓక్క ఫోటో అఫ్ Common Man




ఇపుడు మనుషులు ఇలా తింటు ఉనారు ఉల్లిని

ఫోటో కర్టసీ చేగొండి చంద్రశేకర్ గారు వారి ప్రొఫైల్ లో పోస్ట్ చేసింరు ఇది వాస్తవానికి యంతో దెగరగా ఉంది రాబోయీ రోజులో ఇల్లగే జరగవచ్చు ఉల్లి దర తగకపోతే. 

https://www.facebook.com/zindagiimages



ఉల్లి దరలు తగాలంటే అందరు ఉల్లి తిన్నుడు బంద్ చెయాల . చీటికి మాటికి బందులు చేస్తారు .ఇపుడు ఉల్లి తినుడు బంద్ చెయాల అందరు ఓకే 2 వారాలు అపుడు ఉల్లి డిమాండ్ తగి ధర పడిపోతది .రోజు తక్కువ తినె కంటే అందరు ఓక రొండు వారాలు తినకుండ బంద్ చేస్తే సాలు ఉల్లి రేట్ పడిపోతది


ఉల్లిని బంగారం తోటి పోలుస్తునారు
ఈ పెరిగిన రేటు వళ్ళ ఎవరికీ లాబం .ఇది మధ్యలోని దల్లాలులకి లబంచేస్తుంది ఎందుకంటే వాలు రైతు నుండి ఎపుడో తకువ రేటుకు కొకుకొని ఇపుడు రేటు పెంచి మనకి ఎకువకి అముతునారు .ఇది సామాన్యుడికి మరియు రైతుకి ఎలంటి లాబం కలిగించుట లేదు ఇది గమనించాల్సిన విషయం

Monday 24 August 2015

కొత్త రూపాయ నోటులు ప్రింట్ ఎసిన RBI

కొత్త రూపాయ నోటులు ప్రింట్ ఎసిన RBI

కొత్త రూపాయ నోటులు ప్రింట్ ఎసిన్రు RBI .ఓక నోటు విలువ RS 1.14 అయింది
ప్రింటింగ్ కరుచు నోటు కన విలువ ఎకువ

ఈ నోటు సెంట్ పెర్సెంట్ కాటన్ తోటి తయలు చేసింరు .దీని మీద Ashoka Pillar సింబల్ విండో లోపల ఈసారి Satyamev Jayate రాయలేదు ,Latent numerical మద్యలో రాయబడినది మరియు Bharat(హిందిలో) కుడిపకన రాయబడి వునాది
దీని మీధ ఫైనాన్సు సెక్రటరీ సైన్ వుంది ఇది విశేషం ఎందు కంటే ముందు ప్రింట్ అయిన అన్ని నోటుల మీద గావౌర్నేర్ సైన్ వుంటది.

ఎనోతులు మార్కెట్ లోకి ఇంకా విడుదల చేయలేదు ఎందు కంటి వీటి ప్రిప్రిన్టింగ్ కారుచీ ఎకువగ వుంది RS 1.14 ప్రతి ఓకే నోట్ ప్రింట్ కర్చు .

మ్యాగీ ఫాన్స్ మ్యాగీ మాలి మార్కెట్ లోకి వస్తుంది

మ్యాగీ ఫాన్స్ మ్యాగీ మాలి మార్కెట్ లోకి వస్తుంది


మాలి మ్యాగి ని మార్కెట్ లోకి విడుదల చేయడానికి నెస్లే ఇండియా సనోహాలు చేస్తుంది,సో గెట్ రెడీ ఫర్ మాగీ అగైన్ .హైకోర్టు నిషేదం ఎతివేయడంతో మాలి మాగి ఈ యాడాది చివరి లోపు మార్కెట్ లోకి వస్తుంది, నూడుల్స్‌లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడి కావటంతో ఈ ఏడాది జూన్‌లో 450 కోట్ల రూపాయల విలువైన 30 వేల టన్నుల మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే ఇండియా నాశనం చేసిన సంగతి విదితమే. కాగా పంజాబ్‌, హైదరాబాద్‌, జైపూర్‌ల్లోని మూడు ఇండిపెండెంట్‌ లేబొరేటరీలు నిర్వహించిన పరీక్షల్లో సీసం శాతం తగిన మోతాదులో ఉన్నట్లు వెల్లడికావటంతో బాంబే హైకోర్టు మ్యాగీపై నిషేధం ఎత్తివేసింది. అపుడు చేతలో పడేసినం మ్యాగి ఎపుడు మాలి వాపస్ వస్తుంది

Tuesday 18 August 2015

ఒటుకు నోటు కేసులో ఇదరికి నోటీసులు జారి


ఒటుకు నోటు కేసులో కొని ముక్య మయన వాళ పేర్లు బైటకి వచాయీ ,ఇదరు ముగురికి నోటిసులు కూడా ఇచారు వారిలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన మాజి లోక్ సభ నాయుకుడు ,తితిదే మాజీ అధ్యక్షుడైన అదికేశవులు నాయుడు కూమారుడైన కర్ణాటక బేవరేజస్ అండ్ డిస్టిలరిస్ కు ఎండి అయిన శ్రీనివాస్ మరియు అయన కార్యలయ ఉద్యోగి విష్ణు చైతన్య కి తెలంగాణ అవీనీతి నిరోదక శాఖ నోటిష్ లు జారి చేసింది.

Sunday 16 August 2015

Govt is providing subsidized cheap liquor in TS

The government hopes low-priced liquor will discourage human beings from ingesting Sara , which has once in a while brought on deaths
“Saving people’s fitness is critical,” leader minister okay. Chandrashekar Rao changed into quoted in a statement sent from his office. “households need to be glad. They need to lead healthy lives. If reasonably-priced liquor is to be had at decrease fees, i'm assured humans will now not drink Sara Kcr Said.



 The TS Governament authorities’s pass is in contrast to different southern states together with Kerala, that's inside the system of final down booze stores in a phased way.
Political events in Tamil Nadu were pushing for a ban on liquor shops inside the country. United Andhra Pradesh (before Telangana become bifurcated in June ultimate yr) had additionally seen spells of prohibition, when sale of liquor turned into banned.
Reasonably-priced liquor could be synthetic beneath the TS  government’s supervision and allotted thru its channels. Leader minister Rao’s office took care to point out that imparting liquor at backed charges will suggest a loss to the exchequer
“income of cheap liquor will lead to lower sales for the government. But, it's miles first-rate,” said  Kcr .
Within the equal tone, KCR, is popularly referred to as, has declared a warfare against the Sara  makers.
At a meeting with Higher officers to check the new excise policy, he diagnosed a sturdy network that exists from villages, wherein Gudumba is synthetic, to sale points across the State. Illicitly brewed liquor is consumed at what are known as belt stores
We ought to weigh down the community,” KCR instructed officials. “If vital, we should implement PD (Preventive Detention) Act on folks that make Sara,
”asking the police and excise departments to collaborate to cease the threat. The authorities will even reward informants. 
Ts Govt new excise policy will take effect from Oct 1st  
 

Thursday 13 August 2015

ఆనాడు ఎన్టీఆర్ అందుకే ఓడిపోయారు - కెసిఆర్



తెలంగాణ కోసం 60 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు తెలంగాణ రాష్ట్రాలన్ని సాదించుకున్నం అయితే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం అహర్షిశలు పోరాడుతూ అందరిలో ఉద్యమ స్పూర్తిని నింపుతూ నిరాహార దీక్షతో ప్రాణత్యాగానికైనా వెనుకాడని వ్యక్తిగా తెలంగాణ సాధకుడిగా నిలిచారు కేసీఆర్.
అందుకే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయిన దానిపై సానుభూతి చూపకుండా టీఆర్ఎస్ పై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగిస్తున్నారు . . టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ప్రసంగించిన సందర్భంగా ప్రభంజనంతో గెలిచిన ఎన్.టి.ఆర్. ప్రభుత్వం సరిగా లేకపోవడంతో ఆ తర్వాత ఓటమిని ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. ఎన్నో చరిత్రలు మనం చూసాం రాజు ప్రజల్లోకి వెళ్లకుండా అతని అనుచరులు, సిబ్బందితో పాలన కొనసాగిస్తే.. కొంత కాలం తర్వాత రాజు, రాజ్యం కష్టాల పాలు అయిన సంఘటనలు ఎన్నో చూశాం

ఓటుకు నోటు సరికొత్త ట్విస్ట్

తెలంగాణా ప్రభుత్వం కొలువుదీరినప్పటినుండి కేసీఆర్ గారు తన ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంబించాడు.ఐతే ఇక్కడ కేసీఆర్ గారు ఏ పని చేస్తే ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పదకాలను కాపీ చేస్తున్నాడని వాదఙలున్నాయ్.

తాజాగా ఓటుకు నోటు కేసులే రేవంత్ అరెస్ట్ అవ్వడం తదనంతర పరిణామాలు తెలిసిందే.ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వ పథకాలనే కాదు ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఒక సారి పరిశీలిస్తే ఓటుకునోటు వ్యవహారం తెరపైకి రావడంతో బాబు పోన్ ట్యాపింగ్ జరిగిందని దాన్ని తెరపైకి తెచ్చాడు.తెలంగాణా ఏసీభీ టీడిపీ నాయకులకు నోటీసులు ఇస్తే అతను తెలంగాణా నాయకులకు టీన్యూస్ కి నోటీసులు పంపారు.అలాగే తాజాగా ఏసీబీ లోకేష్ డ్రైవర్ కి నోటీసులు పంపగానే ఆంద్రప్రదేష్ సీఐడి కేటీఆర్ డ్రైవర్ కి గన్ మెన్ కి నోటీసులు జారీ చేసింది.
 
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ను పథకాల విషయాల్లోనే కాదు ఓటుకు నోటు కేసులో కూడా కేసీఆర్ గారి ఎత్తులు చంద్రబాబు కాఫీ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

స్వాతంత్ర్య వేడుకల్లో ఖైదీల కవాతు..

స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండ కోట ముస్తాబు అవుతోంది. అధికారుల పర్యవేక్షణలో సర్వాంగ సుందరంగా గోల్కొండ ప్రాంతాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. అయితే ఈ సారి వేడుకల్లో ఖైదీలు కూడా కవాతు చేయబోతున్నారు. అదేంటి ఖైదీలు కవాతు చెయడమెంటని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏంటంటే ఈ సారి జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో జైళ్ల శాఖ కూడా పాల్గోనబోతోంది. జైళ్ల శాఖ తరపున ప్రస్తుతం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చేత కవాతు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
 
ఖైదీలతో కవాతు నిర్వహించడం ఇదే మొదటి సారి. అధికారుల పర్యవేక్షనలో ఈ కవాతును నిర్వహించాలని జైళ్ల శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటికి ఏర్పాట్లు కూడ చేసుకుంటున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలోనే జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చకచక చేసేస్తోంది. ఉన్నతాధికారులు సిఎస్ రాజీవ్ శర్మ, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆగస్టు 15 న ఉదయం 10 గంటలకు కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే వేడుకల్లో తెలంగాణ కళారూపాలను ప్రదర్శించాలని అనుకున్న స్థలాభావం వల్ల సాధారణంగా జరపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బాధ ఇప్ప‌టికైనా అర్ధ‌మైందా...

ప్ర‌త్యేక‌హోదా కోసం మునికోటి అనే వ్య‌క్తి తిరుప‌తిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఎంత బాధాక‌ర‌మైన విష‌యం... తను, త‌న‌పై ఆధార‌ప‌డ్డ కుటుంబం, త‌న‌కోసం ఆరాట‌ప‌డే బంధువులు, మిత్రులూ వీరెవ్వ‌రూ ఆ క్ష‌ణంలో ఆయ‌న‌కు గుర్తురాలేదు. తన ప్రాంతం కోసం, ఆ ప్ర‌జ‌ల సంతోషం కోసం త‌న ప్రాణం పోయినా ఫ‌ర్వాలేద‌నుకున్నాడు. ఎంత గొప్ప త్యాగం. దీనిపై అక్క‌డా ఇక్క‌డా అని కాదు తెలుగు ప్రాంతాలు రెండూ విషాదం వ్య‌క్తం చేశాయి. 
 
కాక‌పోతే... ఈ మునికోటి ఆత్మ‌హ‌త్యతోనైనా బాధ వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రాంత‌ రాజ‌కీయ నాయ‌కులు, వివిధ సంఘాల నేత‌లు ఇప్ప‌టికైనా తెలంగాణ త్యాగ‌ధ‌నుల గొప్ప‌త‌నాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ కోసం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారి గురించి ఆంధ్రా నేత‌లు కొంద‌రు కించ‌ప‌రుస్తూ మాట్లాడిన సంద‌ర్భాలు చూశాం. అంతెందుకు ఒకవర్గం మీడియా సైతం ఆ త్యాగ‌ధ‌నుల త్యాగాల‌ను అవ‌మానించేలా వివిధ ర‌కాల క‌థ‌నాలు కూడా ఇచ్చింది. వారంద‌రూ ఇప్పుటికైనా తాము చేసిన త‌ప్పు స్వ‌యంగా ఒప్పుకొని ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల్సిన త‌రుణం ఇదే. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో అసువులు బాసిన త్యాగ‌ధ‌నుల‌పై తాము చేసిన అవ‌మాన కామెంట్ల‌పై ఒక్క‌క్ష‌ణం ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేసినా వారి ఆత్మ శాంతించిన‌ట్లే.
మునికోటి ఆత్మ‌హ‌త్య‌తో నైనా ఉద్య‌మం కోసం బ‌లి అర్పించుకునే వారి బాధ ఏంటో, వారి ఆకాంక్ష ఎంత బ‌ల‌మైందో ఆంధ్రా ప్రాంత నాయ‌కుల‌కు తెలిసిరావాలి. అంటే... రాష్ట్రాన్ని విభ‌జించ‌డం త‌ప్ప‌నో, ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌డం త‌ప్ప‌నో కామెంట్లు చేయ‌డం ఇక‌నైనా మానుకోవాలి. ఎంద‌రో త్యాగ‌ధ‌నుల పోరాటానికి ఫ‌లితం తెలంగాణ‌! విభ‌జ‌న చేయ‌డం త‌ప్ప‌ని మాట్లాడుతున్న‌ స‌ద‌రు నేత‌లు దీన్ని గౌర‌వించ‌డం నేర్చుకోవాలి.
ఏదేమైనా ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌ర్ధ‌నీయం కాదు. ఏదో కావాల‌న్న ఆకాంక్ష‌తో ఆత్మ‌హ‌త్యలు చేసుకుందామ‌నుకుంటున్న వారు గుర్తించాల్సిన విష‌యం ఏమిటంటే... ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే మీ ఆకాంక్ష సాకార‌మ‌య్యే అద్భుత క్ష‌ణాల్ని చూసే అవ‌కాశాన్ని కోల్పోతారు. ఆ ఫ‌లితాన్ని అనుభ‌వించి ఆనందించాల్సిన మీరు ఈ లోకంలో లేన‌ప్పుడు ఆ ఆకాంక్ష సాకారానికి అర్ధం లేకుండా పోతుంది. అందుకే ఆత్మ‌హ‌త్య‌ల క‌న్నా బ‌తికి పోరాడ‌డమే గొప్ప‌ద‌న్న విష‌యం గుర్తించాలి.

Wednesday 12 August 2015

ఆయనే ఉంటే మంగలితో పనేంటి!

ఆయనే ఉంటే మంగలితో పనేంటి... అంటూ పల్లెటూళ్లలో వినిపించే ముతక సామెత మాదిరిగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నాయకుల పరిస్థితి. తెదేపా ఎమ్మెల్యేలు ప్రస్తుతం మింగలేక కక్కలేక.. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడును నిలదీయలేక, అలాగని ఊరుకుంటే.. తమ పార్టీ పని తెలంగాణలో అధోగతి అవుతుందని భయపడుతూ.. సతమతం అవుతున్నారు. అలాంటి కీలక సమయంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.. వారిని మరింత ఇరుకున పెట్టే సవాళ్లు విసురుతున్నారు. 
తెలంగాణ తెదేపా నేతలు ముందుగా చంద్రబాబునాయుడును నిలదీయాలని తెరాస వారు డిమాండ్‌ చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపివేయడానికి ఏపీ సర్కారు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని తెతెదేపాను కోరుతున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో పథకాల్ని నిలిపేయించే కుట్ర చేస్తున్న తెలుగుదేశం నాయకులు.. అసలు చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదో అర్థం కావడంలేదని ఆరోపిస్తున్నారు. తెతెదేపా నాయకులు.. ప్రజల వైపు ఉంటారో.. చంద్రబాబు వైపు ఉంటారో తేల్చుకోవాలని తెరాస డిమాండ్‌ చేస్తున్నది. 
ఈ వ్యవహారం గమనించిన వారు మాత్రం.. ఆయనే ఉంటే మంగలి ఎందుకు అన్న సామెత చందంగా ఉన్నదని నవ్వుకుంటున్నారు. చంద్రబాబును నిలదీయగల సత్తా ఉంటే గనుక.. తెతెదేపా తెలంగాణలో మరింత బలంగానే ఉండేదని.. అది లేదుగనకనే ఈసురోమంటూ ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ ఇంటి వద్ద ఏపీ సీఐడీ కామెడీ షో

నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్లుంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంద్రా సర్కారు వ్యవహారం. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చేసిన తప్పుకు సిగ్గుపడకుండా రాజ్యాంగబద్ద సంస్థలను తన అడ్డగోలు వ్యవహారాలకు వాడుకుంటుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓటుకునోటు కేసులో విచారణలో భాగంగా వెల్లడయిన సమాచారం మేరకు తెలంగాణ ఏసీబీ అధికారులు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం మూడు రోజుల నుండి వెతుకుతున్నారు.
దీనిని సహించలేని బాబు ఆంద్రా సీఐడీ పోలీసులను పంపి హైదరాబాద్ లో ఈ రోజు కామెడీ షో నడిపించాడు. చంద్రబాబు ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లినందున ఆంధ్రా సీఐడీ అధికారులను కేసీఆర్ ఇంటికి పంపించాడు. అక్కడ కేటీఆర్ డ్రైవర్ సత్యనారాయణకు నోటీసు ఇవ్వాలని చూశారు. అక్కడ ఆయన లేకపోవడంతో అప్పుడు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్ళారు.
ఈ ఎపిసోడ్ అసలు విషయం ఏంటంటే ఓటుకునోటు కేసులో నిందితుడు అయిన జెరూసలెం మత్తయ్య తప్పించుకుని చంద్రబాబు సర్కారు అండతో ఆంధ్రలో అత్తగారింటి వద్ద తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. మత్తయ్య కూడా దొరికిపోతే తన భండారం ఏమవుతుందోనన్న గుబులు బాబు ఉన్నాడు. అందుకే మత్తయ్య, జిమ్మీని ఆంద్రాలో దాచేశాడని తెలుస్తోంది. ఇప్పుడు లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డిని కూడా అలాగే దాచినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు అయిన మత్తయ్య తనను బెదిరించారని చేసిన ఫిర్యాదు మీద ఇప్పుడు నోటీసులు పట్టుకుని తిరుగుతుండడం ఆశ్చర్యంగా ఉంది.
ఆ మధ్య ట్యాపింగ్ అంటూ, బాబు టేపులు ప్రసారం చేశారంటూ తెలంగాణ భవన్ కు వెళ్లి టీ న్యూస్ నోటీసులు ఇచ్చి మరో ఇద్దరు ఐపీఎస్ లు కూడా ఉన్నారంటూ ఆంధ్రా మీడియా ముందు హూంకరించిన ఏపీ సీఐడీ ఆ తరువాత చేతులు ముడుచుకుంది. అసలు ట్యాపింగ్ కానే కాదని, ..తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా టెలిగ్రాఫిక్ చట్టాన్ని ఉపయోగించుకుందని కేంద్రం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్త కామెడీ షో మొదలయిందన్న మాట

కేసీఆర్ గారి వ్యవహారతీరును చూసి ఆశ్చర్యపోయాడు ఒక గ్రామ నాయకుడు

కేసీఆర్ గారి వ్యవహారతీరును చూసి ఆశ్చర్యపోయాడు ఒక గ్రామ నాయకుడు.అతను అంత సాదారణంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కామన్ మ్యాన్ గా ఉండటం చూసి అతమసను ఆశ్చర్యపోయాడు.వివరాల్లోకొస్తె గ్రామజ్యోతి పదకం పై అవగాహన కోసం ఉన్నతాదికారులతో మీటింగ్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదర్శగ్రామమైన గంగదేరసవిపల్లి సర్పంచ్ తో మాట్లాడించి,అతనికి సన్మానం చేసాడు.దీంతో ఆశ్చర్యానికి గురైన ఆయన మాట్లాడుతూ సాదారణంగా పథకాలు అమలయ్యాక వాటిని అమలు చేసే బాద్యత మాలాంటి వాల్లపై ఉంటుంది కానీ ఈ పదకం రూపకల్పన సమయంలో మాలాంటి వాల్లకు అవకాశం దక్కడం అదృష్డం.
ఇలాంటి పెద్దసమావేశంలో నన్ను పదిహేను నిమిషాలు మాట్లాడించాడు.నా ప్రసంగం పూర్తయ్యాక నన్ను సన్మానించారు కేసీఆర్ గారు.నేను పాల్గొనడమే ఒక అదృష్టం అనుకుంటే అందులో మాట్లాడే అవకాశాన్ని కల్పించి నన్ను అంత మందిలో సన్మానించడం గొప్ప అనుభూతి అని ఇందులో కేసీఆర్ గారు ఎంత గొప్పనాయకుడో అర్దమవుతుందని ఆయన అన్నాడు

ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?

ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?
ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది. ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు సమర్పించడంతో ఇన్నాల్లు చల్లబడిన దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది.  సాంకేతిక అడ్డంకులు తొలగిపోయి కీలకమైన సమాచారం అందడంతో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. గత నెల 4 తేదిన నోటిసులు ఇచ్చినా... ఇప్పటి వరకు ఏసీబీ ముందుకు విచారణకు హాజరుకాలేని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మీ బాబు ఆచూకి సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు కనుగొన్నట్లు సమాచారం. నోటిసులు అందినవెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిన జిమ్మీ బాబు కోసం ఏసిబీ ప్రత్యేక బృందం వెతుకుతోంది. ప్రస్తుతం అయన ఏపీలోని అతని బదువుల వద్ద తలదాచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 
 
కేసులో కీలకంగా ఉన్న ఫోరెన్సిక్ నివేదికను అధికారులు కోర్టుకు అందజేశారు. ఈ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వారి ఇళ్ళలో లభించిన కంప్యూటర్ ఫైల్స్ లను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నివేదికను ఇటివల కోర్టుకు అందజేసింది. అయితే ఈ నివేదికను నేరుగా పొందే అవకాశం లేకపోవడంతో కోర్టు ద్వారా ఫోరెన్సిక్ నివేదికను పొందడానికి ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఫోరెన్సిక్ తుది నివేదిక గనుక ఏసీబీ చేతికి అందితే మరి కొంత మంది వ్యక్తులను ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలలో జిమ్మీ బాబును ప్రశ్నించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు

ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ పుంజుకుంది

ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ పుంజుకుంది.
ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ  పుంజుకుంది. కొన్నాళ్ళు మందగించిన దర్యాప్తు ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు చేరడంతో మళ్లీ వేగం అందుకుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్ళడంతో కేసులో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలతో పాటు వారి అనుచరులను వారి డ్రైవర్లను కూడా విచారిస్తున్నారు. అందులోభాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కాన్వాయ్ లోని డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు అధికారులు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అయితే కొండల్ రెడ్డి అక్కడ లేకపోవడంతో వెనుదిరిగిన ఏసీబీ అధికారులు అక్కడి నుండి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లారు. ఈ రోజు కొండల్ రెడ్డి ఇంటికి ఏసీబీ అధికార్లు వెళ్లనున్నారు. 

 


  

కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ తో పాటు మరో నిందితుడు సండ్ర వెంకట వీరయ్య, కేసుతో సంబంధం ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేంనరేందర్ రెడ్డి  డ్రైవర్లను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఎక్ష్ ట్రా ఎవిడెన్స్ కొరకు నేతల డ్రైవర్లను విచారిస్తున్న అధికారులకు వారి నుండి కీలక సమాచారం  లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోకేష్ బాబు వెనక ఉంది నడిపించారని  ఆరోపణలు ఉన్నాయి. దీంతో లోకేష్ బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎవరెవరిని కలిసారో అయన డ్రైవర్ కొండల్ రెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అధినేత చంద్రబాబు ఇంటికి ఏసిబీ వెళ్ళినట్లు సమాచారం తెలియడంతో తెలుగు తమ్ముళ్ళు  ఆందోళనలో పడ్డారు

ఇక విడాకులకు రంగం సిద్దం.గెట్ రెడీ.




ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడు అదికారంలోకి వచ్చాడు.గెలిచిన తర్వాత బీజీపి వాల్లు కేంద్ర క్యాబినెట్ లో టీడీపి నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు.అలాగే టీడీపీ కూడా ఆంద్రాలో బీజేపికి మంత్రి పదవులు ఇచ్చింది.కానీ ఇప్పుడు తెగదెంపులు జరగనున్నాయా...? ప్రభుత్వం నుండి దోస్తీ కట్ చేసుకుంటున్ల..?అవుననే అంటున్నారు విశ్వసనీయ వర్గాలు.
ప్రత్యెక హోదా విషయంలో కేంద్రం ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో ఆంద్రలో ఆందోళనలు మొదలయ్యాయి తాజాగా ఒకరు ఆత్మహత్య కూడా చేసుకున్నరు.ఈ నేపద్యంలో బీజేపీ ఇకనైనా స్పందించకుంటే తెగదెంపులు చేసుకుంటామని బాబు అన్నట్టు సమాచారం.కానీ బాబు ఆ దైర్యం చేస్తాడా వేచి చూడాలి.

Tuesday 11 August 2015

ప్రపంచ వేదికపై మిషన్ కాకతీయ.......

ప్రపంచ వేదికపై మిషన్ కాకతీయ.......

 

తెలంగాణా ప్రభుత్వం కొలువు దీరినాక మొదలెట్టిన పనిలో మిషన్ కాకతీయ ఒకటి దీని ఉద్దేశం చెరువుల పునరుద్దరణదానికి అనుగుణంగా నే తొలి యేడాదిలో కొన్ని చెరువులను పునరుద్దరించి వాటికి పూర్వవైభవం తీసుకొచ్చారు.ఐతే ప్రభుత్వం ప్రారంబించిన ఈ బ్రుహత్తర కార్యాని మరో గుర్తింపు వచ్చింది.
కాగా, మిషన్ కాకతీయ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ జల వారోత్సవం సందర్భంగా ఈ నెల 23 నుంచి 28 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు పిలుపు వచ్చింది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతిఏటా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడంతోపాటు ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి నోబెల్ బహుమతితో సమానమైన వాటర్ ప్రైజ్‌ను అందజేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్‌ను 2015కుగాను స్టాక్‌హోం వాటర్‌ప్రైజ్ వరించింది.
మొన్న రాజెందర్ సింగ్ తెలంగాణా లో వరంగల్ జిల్లాలో చెరువుల పర్యటనలో బాగంగా కొన్ని చెరువులను సందర్శించి మిశన్ కాకతీయను మెచ్చుకున్న విశయం తెలిసిందే

ఏ దేశం వెళ్తే ఆ దేశంల మారుస్త AP బాబు

ఏ దేశం వెళ్తే ఆ దేశంల మారుస్త AP బాబు

పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట

పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట

వాళ్ళిద్దరూ భార్యా భర్తలు...ప్రజల ఆరోగ్యాలని కాపాడాల్సిన డాక్టర్లు. కానీ పసివాళ్ళతో వ్యాపారం చేశారు... డ్రాకులాల వలె వాళ్ళ రక్తాన్ని పిండి కోట్లు సంపాదించారు... ఆ పసిపిల్లల ఆరోగ్యాలను ప్రమాదంలో పడేశారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో డాక్టర్ వీకే కోహ్లీ, డాక్టర్ చిత్రా కోహ్లీ లు కాంచన్ మార్కెట్ వద్ద ఓ పాథలాజికల్ ల్యాబ్ ఓపెన్ చేసి దందా ప్రారంభించారు. ఎనిమిదేళ్ళు కూడా నిండని పిల్లలను ప్రలోభపెట్టి వాళ్ళకు అణా,పరక ఇచ్చి వాళ్ళ దగ్గర రక్తాన్ని తీసుకుని ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. కొందరు పిల్లల దగ్గర్నుండి వరసగా మూడునాలుగు రోజులు కూడా రక్తాన్ని పీల్చేవారు. బ్లడ్ గ్రూప్ తెలుసుకునే టెస్టులు తప్ప మరే ఇతర టెస్టులు కూడా నిర్వహించకుండానే రక్తాన్ని తీసి అమ్మే వాళ్ళు ఇలా ఆరు సంవత్సరాలపాటు పదివేల మంది పిల్ల రక్తాన్ని పీల్చిన ఈ డ్రాకులా డాక్టర్లు నాలుగుకోట్ల రూపాయలు సంపాదించారు.
ఈ వ్యాపారం కోసం వీళ్ళిద్దరూ కొంతమంది బ్రోకర్లను కూడా నియమించుకున్నారు. స్లమ్ ఏరియాలోని నిరుపేద పిల్లలను టార్గెట్ చేసుకొని ఈ బ్రోకర్లు పనిచేసేవాళ్ళు. పిల్లల తల్లితండ్రులకు ఈ వ్యవహారం తెలిసి పిర్యాదు చేయడంతో కదిలిన అధికారగణం కోహ్లీల పాథలాజికల్ ల్యాబ్ పై దాడి చేశారు. సిటీ మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ మిశ్రా, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ ఏరియా సర్కిల్ ఇనిస్పెక్టర్ సర్వేష్ కుమార్ మిశ్రా ఇటీవల దాడులు నిర్వహించగా డాక్టర్ల జంట రక్తపు దందా వెలుగు చూసింది. అయితే ఆ డ్రాకులా డాక్టర్ల జంటను అరెస్టు చేద్దామంటే వాళ్ళిక్కడ లేరట ! అమెరికాలో ఉన్నారట. వాళ్ళొచ్చిందాకా ఎదురుచూస్తామని చెప్పిన పోలీసులు ఆ లోపు ల్యాబ్ మేనేజర్ వీకే భట్నాగర్, ల్యాబ్ టెక్నీషియన్ శాంతారాం యాదవ్ లను అరెస్టు చేసి, ల్యాబ్ ను సీజ్ చేశారు

 

బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?

బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?

విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశం చేర్చలేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అనే బిజెపి వాదన అత్యంత దుర్మార్గమైనది. పచ్చి అవకాశవాదం ఇది. విభజన చట్టం ఆమోదం పొందాకనే మోది ఏపిలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు చేసారు. మోది పాల్గొన్న బహిరంగ సభల్లోనే వెంకయ్య 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ విభజన చట్టంలో హోదా అంశం పెట్టకపోతే, బిజెపి చ...
ట్టాన్ని సవరించవచ్చు కదా.. ఎందుకు బిజెపి ఆ పని చేయడం లేదు. పోనీ విభజన చట్టంలో ఉన్న హామీలని అయినా బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తోందా?

ప్రణాళికా సంఘం లేదు, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టి ఇవ్వడం లేదు అనే వాదనలో కూడా నిజం లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఆర్ధిక సంఘానికి లేదు. ప్రణాళికా సంఘం లేకపోయినా హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. బిజెపి చెబుతున్న అడ్డంకులు అన్నీ పచ్చి అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు

జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...

జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ ఆర్ కాంగ్రేస్ అధినేత  వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయనున్నాడంట.,?.ఇక అతని పోరాటం ఒకవైపేనా...?  సంకేతాలు అవుననే వస్తున్నాయి.ఐతే ఆంద్రప్రదేష్ ప్రతిపక్షనేతగా ఉన్న అతను తెలంగాణాలో కూడా పార్టీని పటిష్ట పరచాలని బావించాడు కానీ తెలంగాణాలో అతని ఆటలు నడవకపొయ్యేసరికి తెలంగాణాలో జెండా ఎత్తెయ్యడానికి డిసైడ్ ఐనట్టు సమాచారం.
ఐతే గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో అతను సమైక్యవాదానికే కట్టుబడ్డానిని ఒప్పుకున్నాడు.ఐతే తెలంగాణా పై ఆశలు వదులుకోలేదు కానీ తెలంగాణా లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచింది వైయస్ ఆర్ కాంగ్రేస్ పార్టి.వాటిని కాపాడుకోవడానికి ఇన్నిరోజులు పాకులాడిన ఆపార్టీ అదినేత జగన్ చివరకు తన అసలు రంగు భయటపెట్టాడు.ప్రత్యేకహోదా కోసం దీక్షలో అతను మాట్లాడుతు రాష్ట్రాన్ని విభజించి పాపం చేసారని,రాష్ట్రవిభజన వల్లే ఈ కష్టాలు అని తెలంగాణాపై తన అక్కసును వెలగక్కాడు.దీంతో అతను తెలంగాణాలో అతని పార్టీకి అతనే సమాది కట్టుకున్నట్టైంది.

నాపై జోకులేశారు కాని వెనకడుగేయలేదు......

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్ గారు తన గత అనుభవం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు.గ్రామజ్యోతి పధకం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలగురించి ఆయన స్పందించాడు.గ్రామజ్యోతి పధకాన్ని విజయవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నాడు .
 
2001లో తాను తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు తన పైన జోకులు వేశారని, ఎందరో తిట్టారన్నారు. ప్రపంచంలో తనను తిట్టినట్లు ఎవరినీ తిట్టలేదన్నారు. కానీ, తెలంగాణ ఉద్యమానికి భారత రాజకీయ వ్యవస్థ దిగివచ్చి రాష్ట్రం ఇచ్చిందన్నారు. గ్రామజ్యోతి అద్భుతమైన కార్యక్రమం అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే చేస్తే తెలంగాణ అద్భుతంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న 750 మందికి ఒక చెత్త రిక్షా పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి ఒక డంప్‌యార్డ్, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామన్నారు.
 
డంప్ యార్డుల కోసం రూ.20 కోట్ల నుంచి రూ.20 నిధులతో ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామని, రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 25,000 రిక్షాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించాలన్నారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పాల్గొనాలన్నారు. గ్రామసభలో గ్రామస్తులే గ్రామ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. మనకు శక్తివంతమైన మహిళా సంఘాలున్నాయని, అందరి సమిష్టి కృషితో తెలంగాణను అద్భుతంగా తయారు చేయవచ్చన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా చెత్తా చేదారమే కనిపిస్తోందన్నారు.
 
అలా ఉండకూడదన్నారు. గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ గ్రామాలు వెలిగిపోవాలన్నారు. సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికై ప్లానింగ్ జరగాలన్నారు. ప్లానింగ్‌లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.

దుర్గంచెరువు .. రూ.1500 కోట్ల భూమి స్వాహా

దుర్గంచెరువు .. రూ.1500 కోట్ల భూమి స్వాహా

 

హైదరాబాద్ లోని అత్యంత విలువయిన ప్రాంతం జూబ్లీహిల్స్ లో ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల దాదాపు రూ.1500 కోట్ల విలువయిన ప్రభుత్వ భూమి 60 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ అంచనాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ భూమి అంతా కబ్జాకు గురి అయినట్లు కనిపిస్తుందని, ఈ భూములు ఆక్రమించిన వారు ఎంత పెద్దలయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఈ రోజు దుర్గం చెరువును ఈ కమిటీ సందర్శించింది. ఈ మేరకు 60 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించారు. చెరువులు కబ్జాలఅకు పాల్పడే వారి మీద చర్యలు తప్పవని, కబ్జా చేసిన వారి వివరాలను అదే చెరువుల వద్ద ప్రదర్శనకు ఉంచుతామని రామలింగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఎన్నో విలువయిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఒక్క దుర్గం చెరువు చుట్టే ఇంతభూమి కబ్జాచేస్తే హైదరాబాద్ లో మరింత విలువయిన భూములు ఉన్నాయనడంలో సందేహం లేదు

టీడీపీ గవర్నర్ గయాబ్ !

తెలుగుదేశం పార్టీ గవర్నర్ సారీ ..సారీ ..ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంపిక చేసిన గవర్నర్, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దళితుడు అయిన మోత్కుపల్లి నర్సింహులు ఈ మధ్య కనిపించడం లేదు. ఓటుకునోటు కేసులో చంద్రబాబును బానే వెనకేసుకు వచ్చిన మోత్కుపల్లి ఆ తరువాత మీడియా ముందు గానీ వెనకగాని కనిపించడం లేదు. ఆయన పార్టీని వీడుతున్నాడంటూ ఆ మధ్య పార్టీ నుండే పుకార్లు లేపారని, ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నాడని ఆంధ్రా మీడియా ద్వారా వ్యూహాత్మకంగా వార్తలు ప్రసారం చేయించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎవ్వరినయినా వాడుకుని వదిలేసే అలవాటున్న ఆంధ్రా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో మోత్కుపల్లిని వీలయినంత ఎక్కువగా వాడుకున్నాడు. గత ఎన్నికల ముందు రాజ్యసభ సభ్యుడుగా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా తెలంగాణ కోటాలో ఆంధ్రాకు చెందిన రామ్మోహన్ రావుకు ఇచ్చారు. ఆ తరువాత మోత్కుపల్లి నర్సింహులు బుజ్జగించి ఆయనకు ఏ మాత్రం పట్టులేని మధిర ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు. ఓడిపోయినా రాజ్యసభ ఖాయం అని నమ్మించారు.
త్వరలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ఎమ్మెల్యేల నుండి తెలంగాణకు చెందిన మోత్కుపల్లిని ఎంపీని చేసే ఇష్టంలేని బాబు అండ్ కో మెల్లిగా మోత్కుపల్లి గవర్నర్ అవుతున్నాడంటూ తన అనుకూల ఆంధ్రా మీడియాతో ప్రచారం మొదలు పెట్టించాడు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే రేపో ..మాపో కేంద్రం మోత్కుపల్లిని గవర్నర్ గా ప్రకటిస్తుంది అన్నట్లు కథనాలు వండి వార్చాడు. ఆ కథ ఎటూ తేలడం లేదు. దీంతో ఇక లాభం లేదని మోత్కుపల్లి పార్టీ మారుతున్నాడని కథ మొదలెట్టారు. దీంతో బాబు పన్నాగం గమనించిన మోత్కుపల్లి సడన్ గా సైలెంట్ అయిపోయాడు.
తాను ఇప్పుడు ఏం చేసినా దానిని సాకుగా చూపి చంద్రబాబు రాజ్యసభ కోటా నుండి తనను తప్పిస్తాడని, రేపు టీడీపీ నుండి రాజ్యసభకు ఎంపిక చేసే పేర్లలో తన పేరు లేకుంటే అప్పుడు బాబు భరతం పట్టాలని తెరవెనక ప్రిపరేషన్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. అందుకే ఓటుకునోటు ఉదంతం అప్పటి నుండి అడపాదడపా బయటకు వచ్చిన మోత్కుపల్లి ఆ తరువాత చంద్రబాబుకు సంబంధించిన కీలక విషయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. గత నెలరోజులుగా మోత్కుపల్లి అసలు మీడియా ముందుకే రాలేదు. మరి బాబు మాయోపాయాలను ఎదుర్కొని ఆంధ్రా కోటా నుండి మోత్కుపల్లి ఎంపీ అవుతాడా ? లేక బాబు చేతిలో బలయిన వారి ఖాతాలో మోత్కుపల్లి చేరతాడా ? వేచిచూడాలి

బాబుకు గుచ్చుకుంటున్న ‘రోజా’ముల్లు

తెలుగుదేశం పార్టీలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కీలకపాత్ర పోషించిన ప్రముఖ సినీనటి, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మొదటి నుండి రాజకీయాల్లో కొంత డేరింగ్ గానే దూసుకువెళ్తుంది. 2009 ఎన్నికలకు ముందు టీడీపీలో కీలకంగా ఉన్న రోజా చిత్తూరు జిల్లా నగరిలో పూర్తి పట్టు సాధించింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుండి వచ్చిన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు నగరి టికెట్ ఇచ్చి రోజాను చంద్రగిరికి పంపడంతో రోజా ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తరువాత ఆమె కాంగ్రెస్ లోకి అటు నుండి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. చంద్రబాబు రాజకీయాల గురించి పూర్తి అవగాహన  ఉన్న రోజా బాబును విమర్శించడంలో దిట్ట. ఆంధ్రకు ప్రత్యేకహోదా కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రోజా బాబు పరువు తీసింది.
“ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించాడు. పట్టిసీమ ప్రాజెక్టును మొదలు పెట్టి కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు దండుకుని అవినీతిలో ప్రత్యేకహోదా సాధించాడు. అవినీతి చేసిన సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొని ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి ఆంధ్రప్రదేశ్ పరువును తీయడంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించాడు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే బాబు ఆంధ్ర పరువు తీశాడు.
ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా అని ప్రకటించిన మోడీ చంద్రబాబు నాయుడులు ఇప్పుడు ఏం చెప్పడం లేదు. ఎక్కడ కేంద్రాన్ని గట్టిగా అడిగితే తన అవినీతి మీద విచారణకు ఆదేశిస్తారో అని చంద్రబాబు కిక్కురుమనడం లేదు. గత ఎన్నికల్లో ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామన్న మోడీ పీఎం హోదా సాధించాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్రకు సీఎం హోదా సాధించాడు. కానీ ఆంధ్రకు ప్రత్యేక హోదా మాత్రం రాలేదు” అని నటి, ఎమ్మెల్యే రోజా బాబును ఎద్దేవా చేశారు. మొత్తానికి బాబుకు రోజా కొరకరాని కొయ్యాల తయారవుతున్నది వాస్తవం

Facts




ప్రపంచం మొత్తం గుగూల్ తల్లిని నమ్ముకుంటే, ఆ తల్లి మాత్రం మన ఇండియన్ ను నమ్ముకుంది.


రంగం ఏదైనా.. ఇది మా ముద్ర అంటూ … దేశ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టతలను ఘనంగా చాటుతున్నారు మన దేశ రత్నాలు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగం లో మాత్రం పెద్ద తలలన్నీమనవే. నిన్నటి వరకు తెలుగు తేజం సత్య నాదెళ్ళ మైక్రో సాఫ్ట్ CEO అని ఎలుగెత్తి చెప్పినోళ్లం… ఇప్పుడు మన ఛాతీని ఇంకాస్త విశాలంగా చేసి చెప్పుకుందాం….. గుగూల్ CEO కూడా మా ...వాడేనని.



ప్రపంచం మొత్తం గుగూల్ తల్లిని నమ్ముకుంటే ఆ గుగూల్ తల్లి మాత్రం మన ఇండియన్ ను నమ్ముకుంది. అవును సుందర్ రాజన్ చెన్నై కు చెందిన వాడు..ఇప్పుడు గుగూల్ CEO. ప్రపచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గుగూల్ కు CEO అంటే మాటలు కాదు.. కెపబిలిటి, క్రియేటివిటి, నమ్మకం ఇవ్వన్ని ఉంటేనే సాధ్యమయ్యే అవకాశం అది.



అటువంటి అవకాశాన్ని పొందాడు సుందర్ రాజన్, చెన్నై కు చెందిన రాజన్ తల్లి స్టెనో గ్రాఫర్, తండ్రి ఇంజనీర్.. చిన్నప్పుడు తను కూడా డాలర్ డ్రీమ్స్ వేటలో అమెరికా వెళ్లినవాడే. IIT ఖరగ్ పూర్ లో డిగ్రీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో MS, వార్డన్ యూనివర్సిటీలో MBA ఇలా చదువులన్నీ ప్రఖ్యాతి చెందిన కాలేజీల్లోనే సాగాయి.



రాజన్ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. సాఫ్ట్ వేర్ రంగంలో భారతదేశ ముద్ర ఏ విధంగా ఉందో అని, దానితో పాట మన IIT ల స్టాండర్ట్ ఏంటో ప్రపంచ దేశాలకు మరో మారు తెలిసొచ్చింది

Funny