Tuesday 11 August 2015

దుర్గంచెరువు .. రూ.1500 కోట్ల భూమి స్వాహా

దుర్గంచెరువు .. రూ.1500 కోట్ల భూమి స్వాహా

 

హైదరాబాద్ లోని అత్యంత విలువయిన ప్రాంతం జూబ్లీహిల్స్ లో ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల దాదాపు రూ.1500 కోట్ల విలువయిన ప్రభుత్వ భూమి 60 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ అంచనాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ భూమి అంతా కబ్జాకు గురి అయినట్లు కనిపిస్తుందని, ఈ భూములు ఆక్రమించిన వారు ఎంత పెద్దలయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఈ రోజు దుర్గం చెరువును ఈ కమిటీ సందర్శించింది. ఈ మేరకు 60 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించారు. చెరువులు కబ్జాలఅకు పాల్పడే వారి మీద చర్యలు తప్పవని, కబ్జా చేసిన వారి వివరాలను అదే చెరువుల వద్ద ప్రదర్శనకు ఉంచుతామని రామలింగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఎన్నో విలువయిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఒక్క దుర్గం చెరువు చుట్టే ఇంతభూమి కబ్జాచేస్తే హైదరాబాద్ లో మరింత విలువయిన భూములు ఉన్నాయనడంలో సందేహం లేదు

No comments:

Post a Comment