Tuesday 11 August 2015

బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?

బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?

విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశం చేర్చలేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అనే బిజెపి వాదన అత్యంత దుర్మార్గమైనది. పచ్చి అవకాశవాదం ఇది. విభజన చట్టం ఆమోదం పొందాకనే మోది ఏపిలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు చేసారు. మోది పాల్గొన్న బహిరంగ సభల్లోనే వెంకయ్య 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ విభజన చట్టంలో హోదా అంశం పెట్టకపోతే, బిజెపి చ...
ట్టాన్ని సవరించవచ్చు కదా.. ఎందుకు బిజెపి ఆ పని చేయడం లేదు. పోనీ విభజన చట్టంలో ఉన్న హామీలని అయినా బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తోందా?

ప్రణాళికా సంఘం లేదు, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టి ఇవ్వడం లేదు అనే వాదనలో కూడా నిజం లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఆర్ధిక సంఘానికి లేదు. ప్రణాళికా సంఘం లేకపోయినా హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. బిజెపి చెబుతున్న అడ్డంకులు అన్నీ పచ్చి అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు

No comments:

Post a Comment