Tuesday 11 August 2015

Facts




ప్రపంచం మొత్తం గుగూల్ తల్లిని నమ్ముకుంటే, ఆ తల్లి మాత్రం మన ఇండియన్ ను నమ్ముకుంది.


రంగం ఏదైనా.. ఇది మా ముద్ర అంటూ … దేశ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టతలను ఘనంగా చాటుతున్నారు మన దేశ రత్నాలు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగం లో మాత్రం పెద్ద తలలన్నీమనవే. నిన్నటి వరకు తెలుగు తేజం సత్య నాదెళ్ళ మైక్రో సాఫ్ట్ CEO అని ఎలుగెత్తి చెప్పినోళ్లం… ఇప్పుడు మన ఛాతీని ఇంకాస్త విశాలంగా చేసి చెప్పుకుందాం….. గుగూల్ CEO కూడా మా ...వాడేనని.



ప్రపంచం మొత్తం గుగూల్ తల్లిని నమ్ముకుంటే ఆ గుగూల్ తల్లి మాత్రం మన ఇండియన్ ను నమ్ముకుంది. అవును సుందర్ రాజన్ చెన్నై కు చెందిన వాడు..ఇప్పుడు గుగూల్ CEO. ప్రపచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గుగూల్ కు CEO అంటే మాటలు కాదు.. కెపబిలిటి, క్రియేటివిటి, నమ్మకం ఇవ్వన్ని ఉంటేనే సాధ్యమయ్యే అవకాశం అది.



అటువంటి అవకాశాన్ని పొందాడు సుందర్ రాజన్, చెన్నై కు చెందిన రాజన్ తల్లి స్టెనో గ్రాఫర్, తండ్రి ఇంజనీర్.. చిన్నప్పుడు తను కూడా డాలర్ డ్రీమ్స్ వేటలో అమెరికా వెళ్లినవాడే. IIT ఖరగ్ పూర్ లో డిగ్రీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో MS, వార్డన్ యూనివర్సిటీలో MBA ఇలా చదువులన్నీ ప్రఖ్యాతి చెందిన కాలేజీల్లోనే సాగాయి.



రాజన్ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. సాఫ్ట్ వేర్ రంగంలో భారతదేశ ముద్ర ఏ విధంగా ఉందో అని, దానితో పాట మన IIT ల స్టాండర్ట్ ఏంటో ప్రపంచ దేశాలకు మరో మారు తెలిసొచ్చింది

No comments:

Post a Comment