Wednesday 12 August 2015

ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?

ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?
ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది. ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు సమర్పించడంతో ఇన్నాల్లు చల్లబడిన దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది.  సాంకేతిక అడ్డంకులు తొలగిపోయి కీలకమైన సమాచారం అందడంతో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. గత నెల 4 తేదిన నోటిసులు ఇచ్చినా... ఇప్పటి వరకు ఏసీబీ ముందుకు విచారణకు హాజరుకాలేని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మీ బాబు ఆచూకి సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు కనుగొన్నట్లు సమాచారం. నోటిసులు అందినవెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిన జిమ్మీ బాబు కోసం ఏసిబీ ప్రత్యేక బృందం వెతుకుతోంది. ప్రస్తుతం అయన ఏపీలోని అతని బదువుల వద్ద తలదాచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 
 
కేసులో కీలకంగా ఉన్న ఫోరెన్సిక్ నివేదికను అధికారులు కోర్టుకు అందజేశారు. ఈ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వారి ఇళ్ళలో లభించిన కంప్యూటర్ ఫైల్స్ లను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నివేదికను ఇటివల కోర్టుకు అందజేసింది. అయితే ఈ నివేదికను నేరుగా పొందే అవకాశం లేకపోవడంతో కోర్టు ద్వారా ఫోరెన్సిక్ నివేదికను పొందడానికి ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఫోరెన్సిక్ తుది నివేదిక గనుక ఏసీబీ చేతికి అందితే మరి కొంత మంది వ్యక్తులను ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలలో జిమ్మీ బాబును ప్రశ్నించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు

No comments:

Post a Comment