Wednesday 12 August 2015

ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ పుంజుకుంది

ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ పుంజుకుంది.
ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ  పుంజుకుంది. కొన్నాళ్ళు మందగించిన దర్యాప్తు ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు చేరడంతో మళ్లీ వేగం అందుకుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్ళడంతో కేసులో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలతో పాటు వారి అనుచరులను వారి డ్రైవర్లను కూడా విచారిస్తున్నారు. అందులోభాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కాన్వాయ్ లోని డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు అధికారులు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అయితే కొండల్ రెడ్డి అక్కడ లేకపోవడంతో వెనుదిరిగిన ఏసీబీ అధికారులు అక్కడి నుండి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లారు. ఈ రోజు కొండల్ రెడ్డి ఇంటికి ఏసీబీ అధికార్లు వెళ్లనున్నారు. 

 


  

కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ తో పాటు మరో నిందితుడు సండ్ర వెంకట వీరయ్య, కేసుతో సంబంధం ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేంనరేందర్ రెడ్డి  డ్రైవర్లను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఎక్ష్ ట్రా ఎవిడెన్స్ కొరకు నేతల డ్రైవర్లను విచారిస్తున్న అధికారులకు వారి నుండి కీలక సమాచారం  లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోకేష్ బాబు వెనక ఉంది నడిపించారని  ఆరోపణలు ఉన్నాయి. దీంతో లోకేష్ బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎవరెవరిని కలిసారో అయన డ్రైవర్ కొండల్ రెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అధినేత చంద్రబాబు ఇంటికి ఏసిబీ వెళ్ళినట్లు సమాచారం తెలియడంతో తెలుగు తమ్ముళ్ళు  ఆందోళనలో పడ్డారు

No comments:

Post a Comment